Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా 20వ ర్యాంకు సాధించి సివిల్స్‌కు ఎంపికైన డా.శ్రీజను సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. సివిల్స్‌కు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్ళనున్న డా. శ్రీజ బషీర్‌బాగ్‌లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా డా.శ్రీజను మంత్రి అభినందిం చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి ప్రతిభ చూపించి పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కన్న తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువు లకు, పుట్టిన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల న్నారు. దేశంలోనే 20వ ర్యాంకు సాధించటం ఎంతో గొప్ప విషయమన్నారు. యువతరానికి డా.శ్రీజ విజయం గొప్ప ప్రేరణ కల్గిస్తుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.