Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరి యంట్ వస్తున్నదని, కావున ప్రజలం దరూ తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్త లు తీసుకోవాలని ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నర్సింగ్ యాదయ్య, కాశీ విశ్వనాథ్‌లు సూచించారు. ఈ మేరకు రాచకొండ పోలీసు ఉన్నతాధికారుల అదేశం మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీ సులు ఉప్పల్ చౌరస్తాలో వాహన దారులకు, ప్రయాణికులకు కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కులు ధరించని వారిపై సెక్షన్ 51-60 డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ 2005 ప్రకారం రూ.1,000/-లు జరిమానా విధించ డం జరుగుతుందన్నారు. ఎస్.ఐ. కష్ణస్వామి, ఏ.ఎస్.ఐ. శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.