Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వివిధ వ్యాపారాలను ఎంచుకొని స్వయం కషితో ఆర్థికాభివద్ధి సాధించాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్లో చికెన్ షాప్, 21వ డివిజన్ మెడికల్ షాప్‌లను మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్లు లిక్కి మమత కష్ణారెడ్డి, బంగారు అనిత ప్రభాకర్లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివద్ధికి ఎంతో కషి చేస్తుందన్నారు. యువతీ,యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం కషితో ఎదగాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఇమానుయల్ పీటర్ సుధ తదితరులు పాల్గొన్నారు.