Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోడుప్పల్
ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇష్టారీతిన వినియోగిస్తున్నారని, స్థానిక డివిజన్ కార్పొరేటర్లను కనీసం సంప్రదించలేదని బోడుప్పల్ 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ అధికారు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీటి మళ్లింపునకు చేపడు తున్న ప్రాజెక్ట్ అంచనా నివేదికలో ముంపు ప్రాంతాల ప్రజలకు లబ్ది చేకూర్చకుండా నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర కౌన్సిలింగ్ సమావేశం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్పొరేటర్ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. వరద నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎస్ఎన్ డీపీ ప్రాజెక్ట్ డీపీఆర్ రూపకల్పనలో కార్పొరేషన్ పరిధిలోని రా చెరువును కలుషిత జలాల నుంచి రక్షించాలని భావించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే రా చెరువు దిగువ ప్రాంతంలోని 23, 21 20, 9, 8వ డివిజన్లలో దాదాపు 100 కాలనీలకు మురుగునీటి ముప్పు పొంచి వున్నా.. నిధులను ఇక్కడ కేటాయించకుండా అవసరం లేని ప్రాంతాలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనికి నిరసనగా మెడలో నల్ల కండువా వేసుకుని కౌన్సిల్లో కార్పొరేటర్ వెంకటేష్ యాదవ్ నిరసన తెలిపారు. రా చెరువుకు నిధులివ్వాలని డిమాండ్ చేయడంతో పది కోట్ల రూపాయలు రా చెరువు నుండి నల్లచెరువు వరకు నాలా అభివద్ధి కోసం కేటాయిస్తున్నట్లు మేయర్, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌లు ప్రకటించారు. రాసాల నిరసనకు మద్దతుగా కార్పొరేటర్లు సీసా వెంకటేష్‌గౌడ్, భూక్య సుమన్ నాయక్, మహేందర్‌యాదవ్, అంజలి శ్రీధర్‌గౌడ్, లత రామచం ద్రారెడ్డి, కొత్త దుర్గమ్మ, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొమ్మక్ కల్యాణ్, కోఆప్షన్ సభ్యులు సుగుణ, ప్రభాకర్, నజియబేగం మద్దతు తెలిపారు.