Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజానికి సేవ చేస్తేనే ప్రజల గుండెల్లో స్థానం
- కొత్తగా విధుల్లో చేరిన ఎస్ఐలకు సీపీ ఘన స్వాగతం
నవతెలంగాణ-సిటీబ్యూరో
విధినిర్వహణలో భాగంగా వంద శాతం కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. సమాజ సేవ చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. పోలీస్ శాఖలో కొత్తగా ఎంపికై శిక్షణపూర్తి చేసుకున్న ఎస్ఐలు విధుల్లో చేరుతున్న సందర్భంగా పేట్లబుర్జులోని కార్ హెడ్‌క్వార్టర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా విధుల్లో చేరిన వారిని ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... ప్రతి పోలీస్ అధికారి చట్టపరిధిలో ప్రజలకు సేవలందించడంతో పాటు నీతి, నిజాయితో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల గుర్తింపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు వుంటుందన్నారు. అదే విధంగా తోటి పోలీస్ అధికారులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు పెద్దపీట వేస్తోందని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోందని గుర్తు చేశారు.
నూతనంగా ఎంపికైన 203 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. వారిలో 162 మంది విధుల్లో చేరుతున్నారని మిగిలిన వారు డిసెంబర్ నెలాఖరులోగా చేరనున్నామని తెలిపారు. యువకులు ఉత్సాహంతో పనిచేసి పోలీస్ శాఖకు మరింత మంచిపేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ షికాగోయేల్, డీఎస్ చౌహాన్, విజరుకుమార్, విక్రమ్‌సింగ్ మన్నన్, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేష్, డీసీపీ గజారావు, సునితారెడ్డి, అదనపు డీసీపీ శిరిష తదితరులు పాల్గొన్నారు.