Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని సన్మానించారు. కార్పొరేషన్ పరిధిలో 95శాతం ప్రజలకు మొదటి దశ కరోనా వ్యాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా వైద్య సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌గా తమను గుర్తించినందుకు క్రై సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా ఉద్రిక్త వాతావరణంలో కోవిడ్ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమాలకు తమతోపాటు బస్తీల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేసుకునేలా వీరు సహకరించారన్నారు. సరైన సమయంలో తమ వైద్య సిబ్బందికి క్రై ఎన్జీవో తోడ్పాటు లభించిందన్నారు. సంస్థకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. రెండేండ్లుగా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని గుర్తించడం మనందరి బాధ్యత అని క్రై మెయిన్ ఫెల్లో హిమబిందు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి, డాక్టర్ శైలేష్, అడ్మిన్ స్టాఫ్ శౌకథ్ అలీ, ప్రమీల, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లలు, క్రై సంస్థ ప్రతినిధులు మంజుల, రాజు చిరువెని, సైదులు పాల్గొన్నారు.