Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీఈ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నంది కంటి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్యామల కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమే అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ.రెండు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. సభ్యత్వం తీసుకున్న వాళ్ళంతా సోనియా గాంధీ కుటుంబ సభ్యులే అన్నారు. దేశం కోసం కొట్లా డింది కాంగ్రెస్ అన్నారు. డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రతి డివిజన్, ప్రతి మండలంలో సభ్యత్వ నమోదు చేసుకోవాల న్నారు. ఫోన్లో కాంగ్రెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి బూతు నుంచి వందమంది సభ్యత్వం తీసుకునే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో బూతు ఒక డివిజన్ ఎన్రోల్మెంట్ ఉంటారనీ, వారి ఆధ్వర్యంలో ఎలా సభ్యత్వ నమోదు చేసుకోవాలి అనేది బూతులో ఉన్న ఎన్రోల్మెంట్ అభ్యర్థి పార్టీ కార్యకర్తలకు వివరిస్తారని తలిపారు.