Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
లబ్దిదారుల సమక్షంలోనే అర్హులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం పూర్తి ఖర్చులను భరిస్తూ అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు నిర్మించిన ఇండ్ల ను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్థానిక ప్రజల సమక్షంలో లాటరీ పద్దతిలో లబ్దిదారులకు కేటాయిస్తామని తెలిపారు. బన్సీలాల్‌పేట డివిజన్లోని బండ మైసమ్మ నగర్, చేపట్టిన డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి ముగింపు దశలో ఉన్నాయనీ, వచ్చే నెలలో లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వాటర్, డ్రయినేజీ పైప్ లైన్, విద్యుత్ లైన్, స్ట్రీట్ లైట్స్, రోడ్లు తదితర పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభానికి ముందే స్థానిక ప్రజల సమక్షంలో అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాను సిద్దం చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ శర్మన్, నార్త్ జోన్ జోనల్ కమిష నర్ శ్రీనివాస్‌రెడ్డి, బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్, వసంత కుమారి, సురేష్, వెంకటదాసు రెడ్డి, శ్రీధర్, కృష్ణ, పలు వురు తహసీల్దార్లు పాల్గొన్నారు.