Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేేపీహెచ్బీ
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ఉరుకునేది లేదని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని కేఎస్నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించామన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మించామన్నారు. రోడ్లపై వరద నీరు నిల్వ ఉండకుండా బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మించామన్నారు. కార్యక్రమంలో కొత్తూరు సీతయ్యనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బాబుమియా, శివ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.