Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల ప్రాథమిక ఆర్యోగ ఉపకేంద్రంలో కోవిద్-19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని బుధవారం సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ పేరుతో కరోనా మూడవ దశ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ వినియోగించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొర్రెముల డాక్టర్ హారిక, నర్సు లక్ష్మి, చౌదరి గూడ కార్యదర్శి మదుసుధన్ రెడ్డి పాల్గొన్నారు.