Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఇన్చార్జి కమిషనర్ జి. సునీత ఆధ్వర్యంలో స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికి చెత్తను తీసుకెళ్లి స్వచ్ఛ సేవ డ్రైవర్స్‌కు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేయు వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేస్తున్న స్వచ్ఛ సేవ డ్రైవర్ బాలుని శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రవణ్ కుమార్, రాజశేఖర్, పర్యావరణ ఇంజినీర్ గణేష్, శానిటేషన్ సూపర్ సూపర్ వైజర్స్ సత్యనారాయణ, నరేష్, ప్రేమ, ప్రణీత నాగార్జున పాల్గొన్నారు.