Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
విద్యార్థులు చదువులో బాగా రాణించాలని బహుదూర్‌పుర ఎమ్మార్వో శ్రీరాములు అన్నారు. బుధవారం ఆశ్రిత హోమ్‌ను సందర్శించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నాను అని పిల్లలకు చెప్పారు. మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని తెలిపారు. విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్లను అందించేందుకు ముందు ఉంటానన్నారు. 14 మంది అనాథ పిల్లలకు కూడా సర్టిఫికెట్లను అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ ఎం అరుమ్మయి, ఆశ్రిత హోమ్ డైరెక్టర్ నాగరాజు, సీబీబీ సీపీి- కోఆర్డినేటర్ పర్వతాలు, నిరంజన్ , విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.