Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కొర్రెముల గ్రామంలోని పాండురంగ స్వామి కల్యాణ మహోత్సవానికి గ్రామ పంచాయతీ తరపున ఉపసర్పంచ్ కందుల రాజు ముదిరాజ్, కార్యదర్శి కవిత బుధవారం ఊరేగింపుగా వెళ్లి పుస్తె మట్టెలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు పచ్చి పంటలతో ఆయురారోగ్యంతో ఆనందంగా ఉండాలని, దాదాపు 36 ఏండ్లుగా పాండురంగ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరుగుతుందన్నారు. గ్రామ పంచాయితీ నుండి తలంబ్రాలు, కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు దయ్యాల ఆంజనేయులు, ఉడుగుల సునీత సత్యనారాయణ, కోళ్ళ ఈశ్వరీ యాదగిరి, జువ్వ స్వామి, పర్నాటి బాబు, మాటూరి సుష్మ రవి, కట్ట భార్గవి నాగేష్, చౌదరిగూడ కార్యదర్శి మదుసుధన్ రెడ్డి, నాయకులు తరిణి మహేంద్ర చారీ, ఇతర నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.