Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సంగారెడ్డి జిల్లా యేగోల్ గ్రామానికి చెందిన యువతికి మూడో తరగతి చదువుతున్న సమయంలో ఆటలాడుతూ చెట్టుపై ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి నడుంవద్ద ఉండే ఎముకలకు బలంగా దెబ్బ తగలడం వల్ల (హిప్ జాయింట్) దెబ్బ తిని తను సరిగ్గా నడువలేని పరిస్థితి ఏర్పడింది. యువతి అంగవైకల్యం నయం చేయాలని తల్లిదండ్రులు గత దశాబ్దకాలంగా చేయని ప్రయత్నం లేదు. చివరకు రెనోవా హాస్పిటల్ సనత్‌నగర్‌కు చెందిన ప్రముఖ ఎముకల వ్యాధి శస్త్రచికిత్స నిపుణులు డా. వి కోటేశ్వర ప్రసాద్‌ని సంప్రదించారు. ఈ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకొన్న ఆయన ఇతర వైద్య నిపుణులతో కలిసి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని హిప్ రిప్లేస్మెంట్ (నడుము జాయింట్ మార్పిడి) శస్త్ర చికిత్సనూ పూర్తి చేశారు. మరోవైపు 84 ఏండ్ల వద్ధుడు గత 15 ఏండ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. డా. వి కోటేశ్వర ప్రసాద్ నేతత్వంలో నిపుణుల బందం అతడికి మోకాళ్ల మార్పిడిని దిగ్విజయంగా పూర్తి చేశారు. .
ఈమేరకు బుధవారం రెనోవా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డా.వి కోటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ చూడడానికి సాధారణమైన తుంటి ఎముక మార్పిడి లేదా మోకాలు కీళ్ల మార్పిడి అనిపించినా సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న బాధ ఎన్నో సవాళ్లతో కూడిన అంశమని తెలిపారు. ఖర్చు తగ్గించే క్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడకుండా చికిత్స అందించామని వివరించారు. ముఖ్యంగా 21 ఏండ్ల యువతికి భవిష్యత్ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని తద్వారా ఆమె నాణ్యమైన జీవనాన్ని సాగించడానికి వీలు కలుగుతుందని చెప్పారు.
అనంతరం శస్త్ర చికిత్స చేసుకొన్న యువతి మాట్లాడుతూ అసలు భవిష్యత్ అంతా వికలాంగురాలిగా గడుపాల్సి వస్తుందనే ఆందోళనతో గడిపానని, డా.వి కోటేశ్వర ప్రసాద్ అందించిన వైద్యం, శస్త్ర చికిత్సతో తాను ఇపుడు ధైర్యంగా తన కాళ్ల మీద నడువగలుగుతున్నానని ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. స్వయంగా మీడియా ముందు నడుస్తూ తన లాంటి వారికి మంచి వైద్యం అందుబాటులో ఉందని ధైర్యంగా ముందుకు వచ్చి ఆస్పత్రి వైద్య బందానికి, ఇతర సిబ్బందికి పేరుపేరునా కతజ్ఞతలు తెలిపారు. కీళ్ల మార్పిడి చేయించుకొన్న వద్దుడు మాట్లాడుతూ దశాబ్దకాలానికి పైగా తాను పడ్డ ఇబ్బందులు దూరం అయ్యాయని, అందుకు వైద్యులు తీసుకొన్న జాగ్రత్తులు, అందించిన చికిత్సే కారణమని ఈ సందర్భంగా వారికి ధన్యవాదమలు తెలియజేశారు.
సమావేశంలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.పవన్ మురారి, వైద్య బృందం పాల్గొన్నారు.