Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్‌ను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు , ప్రాంతీయ పత్రికలు, మైనార్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మైనారిటీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు యూసఫ్ బాబా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ సురేందర్ జర్నలిస్ట్ సంగం నాయకుడు కప్పర ప్రసాద్ హాజరై సన్మానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా గెలిచేందుకు చేసిన ప్రయత్నాన్ని హుజూరాబాద్ ప్రజలు ,ప్రజాస్వామ్యవాదులు అడ్డుకున్నారని అన్నారు. సమాజ శ్రేయస్సు కాంక్షించే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కషి చేస్తానని ఈటల అన్నారు.