Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
చాదర్‌ఘాట్ ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు రోజులుగా ఎలక్ట్రిసిటీ అధికారులు కరెంట్ తీసివేయడంతో చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ దష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్కూల్‌ను సందర్శించిన కార్పొరేటర్ మాట్లాడుతూ సుల్తాన్ బజార్ ఎలక్ట్రిసిటీ అధికారులు పాఠశాల కరెంట్ తీసివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు. ఎలక్ట్రిసిటీ అధికారులు వెంటనే ప్రభుత్వ పాఠశాలకు కరెంటు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులతో కలిసి సుల్తాన్ బజార్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.