Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కాచవాని సింగారం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం సమిష్టిగా కషి చేస్తుందని సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామ పంచాయితీ పాలకవర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహత్తర పల్లె ప్రకతి వనంను అన్ని విధాల అభివద్ధి చేయడం జరిగిందని, ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ఎక్కడ లేని విధంగా గ్రామంలో సమర్థవంతంగా అమలు పరచడం జరిగిందని అన్నారు. మరో మారు ఉత్తమ గ్రామ పంచాయితీగా అవార్డు సాధించే విధంగా అన్ని రంగాలలో అభివద్ధికి కషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాలకు తీర్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీత, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు మట్ట విష్ణు గౌడ్, పెరుమాళ్ల సుదర్శన్, కిన్నెర లక్ష్మీ శ్రీ, రాజగోని మహేష్ కుమార్, బండిరాల శ్యామ్, మట్ట లలిత, నల్ల రజిత, నల్ల అరుణ, కో ఆప్షన్ సభ్యులు మోటకట్ల బద్రారెడ్డి, వర్కాల ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.