Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేేపీహెచ్బీ
హైదర్‌నగర్ బస్తీ ప్రధాన రోడ్డు వద్ద పిల్లర్ నంబర్ 675, 676ల మధ్య 15 ఫీట్ల దారి వదలాలని సీపీఐ(ఎం) కూకట్పల్లి మండల కార్యదర్శి ఎం.శంకర్‌తో పాటు సీపీఐ(ఎం) నాయకులు మెట్రో రైల్ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ పిల్లర్ నంబర్ 675, 676ల వద్ద దారి లేకపోవడంతో హైదర్‌నగర్ బస్తీ వాసులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ సిగల్స్ ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగల్స్ ఏర్పాటు జరుగుతుందని, స్పందించి 15 ఫీట్ల దారి వదులాలని కోరారు. దీంతో స్పందించిన ఆయన ట్రాఫిక్ ఏసీపీతో చర్చించి దారి వదులుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు బి.శ్రీను, డి. మహేష్, రాజశేఖర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.