Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్ బసవతారకం నగర్, ఇతర బస్తీల్లో చెత్తకుప్పలు పేరుకుపోయి స్థానికులు అనేక ఇబ్బందులుపడుతున్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు కాటూరు రమేష్ ఆధ్వర్యంలో స్థానిక బస్తీలలో పర్యటించి పేరుకుపోయిన చెత్త కుప్పలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ డివిజన్‌కు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్, కార్పొరేటర్‌గా బీజేపీ గెలిచినందున, రెండు పార్టీల నాయకులు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ నాయకులు కాటూరి రమేష్ ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే స్థానిక కార్పొరేటర్ బస్తీలలో పర్యటించి స్థానికంగా ఉన్న పారిశుధ్య సమస్యలు తీర్చాలని కోరారు.