Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం వెంకట్ రెడ్డి నగర్ ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు నర్సుల ఆధ్వర్యంలో బస్తిలోని విధుల్లో తిరుగుతూ ఎయిడ్స్ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. 'ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం', 'ఎయిడ్స్ కి మందులేదు నివారణే మార్గం', ఎయిడ్స్ నివారణ మనందరి బాధ్యత అని నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు రవీనా దివ్యగౌడ్, శ్రావణి, వైద్య సిబ్బంది బీజేపీ నాయకులు చెల్లోజు ఎల్లాచారి దారం వెంకటేష్ గుప్త, ముశిగంపల శివగౌడ్ పాల్గొన్నారు.