Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కుమార్ ఆదేశానుసారం టీఆర్ఎస్ సర్కార్ చమురుపై వ్యాట్‌ను తగ్గించాలని బుధవారం హబ్సిగూడ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్లలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ డివిజన్ కార్పోరేటర్ కక్కిరేణి చేతన హరీష్, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేములకొండ సోమశేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు సంజరు పటేల్, రఘుపతి గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్, పెంటవల్లి వెంకన్న, బానోత్ పాండునాయక్ , రమేష్ నాయక్, భాస్కర్, గ్యార రవి, బీజేవైఎం అధ్యక్షుడు పుచ్చల అశోక్, మల్లిభారు, సాయి, ముశిగంపల శివగౌడ్, సంపత్ పాల్గొన్నారు.