Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం చిత్తశుద్ధితో నిరు పేద ప్రజల అభివద్దిని ఆకాంక్షిస్తూ ఉందని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. బుధవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఖైరతాబాద్ గ్రంథాలయంలో వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో గర్భిణీల కోసం ఆస్పత్రి భవనాన్ని శాశ్వతంగా నిర్మించాలని ప్రతిపాదన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అలాగే రాజ్ భవన్ రోడ్‌లోని ఎనిమిది బస్తీలకు చెందిన వారు ప్రభుత్వానికి కరెంటు ఇంటి పన్ను నీటి పన్ను చెల్లిస్తూ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా రెగ్యులరైజేషన్ చేసి పట్టాలు అందజేయాలని కోరారు.