Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని తుర్కయాంజల్ మున్సిపల్ కమిషనర్ ఎమ్ఎన్ఆర్ జ్యోతి వ్యాపారులను హెచ్చరించారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు తుర్కయాంజల్ కూడలిలో వీధి వ్యాపారులు, దుఖానాదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు అనర్ధాలపై సమగ్రంగా వివరించారు. 75 మైక్రోన్ కన్న తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను వాడితే జరిమానాతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుఖానాదారులకు మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. వ్యాపారస్తులకు లైసెన్స్ దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్వీరాన్‌మెంటల్ ఇంజినీర్ హరీష్, శానిటరీ సిబ్బంది కుమార్, పెంటయ్య, మురళి, నగేష్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.