Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం రిలీఫ్ పండ్ పేద ప్రజలకు వరం లాంటిదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ 8వ వార్డులోని ఎల్ఎన్ఆర్ కాలనీకి చెందిన పి.రాజమణి అనారో గ్యంతో చికిత్స చేయించుకున్నారు. సీఎం రిలీఫ్ పండ్‌కు దరఖాస్తు చేసుకోగా సీఎం సహాయక నిధి నుంచి రూ.60 వేలు మంజూరు కావడంతో మంత్రి మల్లారెడ్డి లబ్దిదారునికి చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంపన్న బోల్ హరిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఖజా మియా, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.