Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని నల్లగుట్ట మెక్లోడ్గూడాలో నూతనంగా నిర్మిస్తున్న డ్రయినేజీ పైప్‌లైన్ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత పాటించాలని కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈమేరకు గురువారం స్థానికులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. పైప్‌లైన్ నాణ్యత పాటించకుండా గుంతను పూడ్చి వేస్తుండడంతో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి, గుత్తేదారున్ని మందలించి నాణ్యత తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. వెంటనే స్పందించిన కాంట్రాక్టర్ పైప్‌లైన్ తిరిగి నిర్మాణం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మదన్, శ్రీను, సాగర్, సాయి, మనోజ్, శ్రీధర్, నమన్, శ్రీనివాస్ యాదవ్, గోపినాథ్, హెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.