Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ నూతన గృహంలో గురువారం ఏర్పాటు చేసిన అయ్యప్ప మహా పడిపూజకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వామిని భక్త శ్రద్ధలతో పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనూరాధ రాంరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధన్ రాజ్, ఫ్లోర్ లీడర్లు ఐలయ్య, కల్యాణ్ నాయక్, డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మేతరి అనురాధ, కుంట ఉదయ శ్రీ, నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, తాళ్లపల్లి మోహన్ గుప్తా, రెవల్లే యాదగిరి, జొన్నడ సుదర్శన్ రెడ్డి, మేతరి శంకర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.