Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి
నవతెలంగాణ-తుర్కయాంజల్
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తుర్కయాంజల్ మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి తెలిపారు. 2022 స్వచ్ సర్వేక్షన్లో భాగంగా గురువారం రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని, ప్లాస్టిక్ వాడటం ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. పిల్లలు తమ తోటి పిల్లలకు, తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి ప్లాస్టిక్ వాడటం వల్ల జరుగు అనర్థాలు, పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ విజంభిస్తున్నందున, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఎల్లవేళలా పురపాలక సంఘ సహాయ సహకారాలు ఉంటాయని కమిషనర్ తెలపడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మేతరి అనూరాధ దర్శన్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ హరీష్, సానిటరీ సూపర్వైజర్లు మధు, శివ పాల్గొన్నారు.