Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
సాంప్రదాయ ఎత్నిక్ వేర్‌కు నిలయం కావడంతో పాటుగా మహోన్నతమైన భారతీయ వారసత్వం, సాంప్రదాయాలకు గత 58 ఏండ్లుగా ప్రసిద్ధి చెందిన నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ఎనిమిదో షోరూం కొత్తపేటలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని ప్రముఖ నటులు ఐశ్వర్య, శ్రీలేఖ, చక్రవర్తి అన్నారు. గురువారం కొత్తపేటలో నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ను వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మాట్లాడుతూ తాజా కలెక్షన్ పట్టు, సిల్క్ చీరల తో పాటుగా సాంప్రదాయ వస్త్రాలకు నర్సింగ్ క్లాత్ ఎంపోరియం పెట్టింది పేరు అన్నారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ సంజరు సింగనియా మాట్లాడుతూ వైవిధ్యమైన ఫ్యూజన్ వేర్‌ను డిజైనర్ సిల్క్, పట్టు చీరలు, సల్వార్, డ్రెస్ మెటీరియల్, కుర్తీలు, మిక్స్ అండ్ మ్యాచ్ లలో ఉంటాయన్నారు. సిల్క్ పట్టు చీరలు స్వచ్ఛమైన మల్బరీ సిల్క్ తో రూపుదిద్దుకున్నవి ఉంటాయన్నారు. 1964లో వస్త్ర ప్రపంచంలో అడుగుపెట్టడంతో పాటుగా పరిశ్రమలో విజయవంతంగా క్యాతి తెచ్చుకున్న మన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోడల్స్ పాల్గొన్నారు.