Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు. గురువారం బీదల్ బస్తీలో జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రయినేజీ లైన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రూ.43 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్, టీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.