Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎమ్మార్పీఎస్, టీఎంఎస్ఎఫ్ ఆధ్యర్యంలో డిసెంబర్ 8, 9న నిర్వహించనున్న చలో ఢిల్లీ కరపత్రాలను గురువారం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆవిష్కరించారు. కేంద్రం మెడలు వంచైనా ఎస్సీ వర్గీకరణ సాధించి పెడుతామన్నారు. కార్యక్రమంలో టీఎంఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ నకిరేకంటి సైదులు, ఓయూ జాక్, టీఎస్ జాక్,స్టేట్ కోఆర్డినేటర్ పూలెఎద్దుల రాజు మాదిగ, శీనివాస్ మాదిగ, వెంకటేష్ మాదిగ, అజరు మాదిగ, సతీష్ మాదిగ, సుధాకర్ మాదిగ, సందీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.