Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆపత్కాలంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స అందించడమే కాకుండా ఎప్పటికపుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించడంలో ముందంజలో ఉండే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతనంగా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఆక్సిజన్ ప్లాంట్‌లో 95 శాతం నాణ్యతతో కూడిన ప్రాణవాయువును నిమిషానికి 500 లీటర్ల చొప్పున ఉత్పత్తి చేయనుంది. ఈమేరకు శుక్రవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చైర్మెన్ బాలకష్ణ లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆక్సిజన్‌ను విమానాలలో ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ యాజమాన్యం, సిబ్బంది కషితో అలాంటి ఇబ్బందులు హాస్పిటల్లో తలెత్తకుండా చూశామని తద్వారా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందించగలిగామని చెప్పారు. ఈ సరికొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రసిద్ద ఫార్మా దిగ్గజం నొవార్టిస్ వారు అందించిన కోటి 20 లక్షల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశామన్నారు. గతంలో కూడా సంస్థ సీఈఓ డా.ఆర్ వి ప్రభాకర రావు కషితో నొవార్టిస్ కంపెనీ వారు 3 కోట్ల 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారని ఈ సందర్భంగా కంపెనీ వారికి కతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ డా.ఆర్ వీ ప్రభాకర రావు, ఎండీ డా.టీఎస్ రావ్, డా.ఫణి కోటేశ్వర రావు, డా వీరయ్య చౌదరి, రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.