Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయానికి వెళ్లే కూడలిలో ప్రధాన రహదారిని బాజాప్తా కబ్జా చేసి భవన నిర్మాణ సామగ్రిని ఉంచడమే కాకుండా రోడ్డుపైనే సదరు సంస్థ తన కార్యాలయ భవనాన్ని నిర్మించింది. రోజూ వేల మంది ప్రయాణించే ఈ చౌరస్తాలో గత కొన్ని నెలలుగా ఈ ఆక్రమణ చోటు చేసుకుంటున్నా అధికారులు స్పందించకపోవడం విచారకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సదరు సంస్థపై చర్యలు తీసుకొని రోడ్డుపైన ఆక్రమణలు తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.