Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-ముషీరాబాద్
డిసెంబర్ 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య అన్నారు. ఈమేరకు గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది రజకులకు ఉపాధి-వృత్తి ఆధునీకరణ ద్వారా ఆర్థిక స్థితిని పెంచాలని, అందుకు రాష్ట్ర్ర శిక్షణ సదస్సు ద్వారా అనేక అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ పొందిన రజకుల అందరికీ రూ.5 లక్షల బీమా, ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీస్ శాఖలు తదితర సంస్థల్లో బట్టల శుభ్రత వృత్తిపని రజక సొసైటీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడ్రన్ వాషింగ్ మిషన్, లాండ్రి దుకాణాలు ఏర్పాటుకు అవకాశాలు, ఆర్థిక సహకారం అందించాలన్నారు. వీరనారి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు తదితర అంశాలపై ఈసదస్సులో సమాలోచన జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో రజక వృత్తిలో ఉపాధి, వృత్తి నైపుణ్యత కల్పించడం ద్వారా వారికి ఆదాయాలు పెరుగుతాయని అందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బాలకృష్ణ, సహాయ కార్యదర్శి సి.మల్లేశం, కమిటీ సభ్యులు పి.రాములు, ఎం.గోపాల్, పొన్నం వెంకన్న, మంజుల, శ్రీశైలం, రాజు పాల్గొన్నారు.