Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సేవా రత్న లెజండరీ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని నిలోఫర్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 పుష్ప తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు అందించిన సేవలను గుర్తిస్తూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పుష్ప అందించిన సేవలకు గాను రాకë మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జి.చంద్రయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి డాక్టర్ వేణుగోపాలాచారి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తామందించిన సేవలను గుర్తిస్తూ ఇచ్చిన అవార్డు అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. తనను అవార్డుకు ఎంపిక చేసిన కారుణ్య వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు, చైర్మెన్ లయన్ డాక్టర్ వీణ సరస్వతికి ధన్యవాదాలు తెలిపారు.