Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రముఖ సామాజికవేత్త, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విశ్వగురు అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా సుమారు రెండువేల మంది నిరుపేదలకు ఫుడ్, వాటర్ ప్యాకెట్లు అందించడం అభినందనీయమన్నారు. ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీనివాస్ గుప్తా విశ్వగురు అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ సీఈఓ సత్యఓలు రాంబాబు మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్న వారితో పాటు సమాజానికి మేలుచేస్తున్న వారిని గుర్తించి గౌరవన్నామన్నారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు కృష్ణాది శేషు, ఉప్పల స్వప్న గుప్త, కిరణ్, సాయి తేజ, యాదయ్య గౌడ్, ధీరజ్ శేషు తదితరులు పాల్గొన్నారు.