Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నవంబర్ 18వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 64వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్‌లో పాల్గొం టున్న తెలంగాణ ప్రముఖ షూటర్ కుమారి ఈషా సింగ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ సంతోష్ ఈ సందర్భంగా ఈషా సింగ్ రాబోయే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం మొత్తం నుంచి వేల మంది షూటర్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్లో ఈషా సింగ్ ప్రముఖంగా నిలవడం సంతోషదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంపీలు బీబీ పాటిల్, నేత వెంకటేష్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకట ేశ్వర రెడ్డి, ఈషా తండ్రి సచిన్ సింగ్ పాల్గొన్నారు.