Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ప్రతి కార్మికుడికీ ఉచిత కార్మిక బీమా ఇస్తామని రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పార్క్ లైన్లోని సీటీసీ కార్మికులకు బీమా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనం ఘటిత రంగ కార్మికులు ఎవరంటే వ్యవసాయ, అను బంధంగా పని చేసేవారు అన్నారు. చిన్న సన్నకారు రైతు లు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన, దాని అనుబంధ రంగాల్లో పనిచేసేవారు, తాపీ, తవ్వకం, రాళ్లు కొట్టేవారు, ప్రింటింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పియింటర్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక సున్నం బట్టీలు, డిగ్గర్లు, కాంక్రీట్ మిక్చర్, పూడిక కార్మికులకు ఇవ్వనున్నట్టు తెలి పారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ సహాయ కమిషనర్ స్వామి, అసిస్టెంట్ లేబర్ అపీసర్లు లచిరెడ్డి, గిరిరాజ్, సీటీసీ కాంప్లెక్ అసోసియేషన్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, నాయకులు చీర శ్రీకాంత్, నరేందర్ పాల్, శ్రీనివాస్, సాయి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.