Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ద పీడియాట్రిక్ అండ్ కాన్జెన్షియల్ ఇంటర్వెన్షనల్ కార్డియోవాస్క్యులర్ సొసైటీ వ్యవస్థాపక పరిశోధకునిగా డాక్టర్ నాగేశ్వర్రావు కోనేటి ఎన్నికైనట్టు రెయిన్ బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఫిజీషియన్ల కోసం ఏర్పడిన అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ పీఐసీఎస్ సొసైటీ. పుట్టుకతోనే గుండె వ్యాధులు గల శిశువులకు వీరి బృందాలు, అతి తక్కువ కోత ఉపద్ధతులను ఉపయోగించి చికిత్స అందిస్తాయి. పీఐసీఎస్ సొసైటీలో ఫౌండింగ్ ఫెలోషిప్ సాధించడమనేది అంతర్జాతీయ గుర్తింపు. అత్యున్నత ప్రత్యేకతలు కలిగిన రంగంలో అసాధారణ నైపుణ్యానికి ప్రతీకగా ఇది నిలుస్తుంది. రెయిన్ బో చిల్డ్రన్స్ వద్ద సీనియర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టుగా నాగేశ్వర్రావు సేవలందిస్తున్నారు. పీడియాట్రిక్ కార్డియాలజీలో ఎన్నో విభాగాల్లో మార్గదర్శకునిగా నిలిచారు. నాగేశ్వర్రావు గుండెలోని వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్స్ మూసేయడానికి విప్లవాత్మక విధానం రెట్రో గ్రేడ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. దేశంలోనే మొదటి సారిగా పిండంలో ఉండగానే గుండె చికిత్సను ఆయన చేశారు. లైప్టెక్ భాగస్వామ్యంతో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్స్‌ను ఇతర అసాదారన మార్గాలను మూసేయడానికి నూతన ఉపకరణంను సైతం ఆయన అభివృద్ధి చేశారు. ఈ ఉపకరణాన్ని కోనార్-ఎంఎఫ్ (కోనేటి నాగేశ్వర్రావు మల్టీ ఫంక్షన్)గా పిలుస్తారు. ఎన్నో దేశాల్లో ఈ ఉపకరణం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈయన 80కిపైగా పేపర్లను జర్నల్స్‌లో ప్రచురించారు.