Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓ రిసార్ట్లో రహస్య సమావేశం నిర్వహించి చైర్మెన్, వైస్ చైర్మెన్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మెన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మెన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి పాలకవర్గం నాటి నుంచి నేటి వరకు వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వక పోవడం వల్ల సమస్యలు పరిష్కరించలేకపోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఛైర్మెన్, వైస్ చైర్మన్ల వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తప్ప మిగతా వార్డుల్లో జరగడం లేదని మండిపడ్డారు. కాలనీల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు తమపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం చాలా బాధగా ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకే ఇలాంటి పరిస్థితి వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతామన్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగే వరకు ఛైర్మెన్, వైస్ చైర్మన్లపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాను నాయక్, మంగళపురి వెంకటేష్, మాదిరెడ్డి నర్సింహ్మ రెడ్డి, రామరం శ్రీహరి గౌడ్, వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.