Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగర కమిటీ నాయకులు నిజాం కళాశాల హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి జావిద్ మట్లాడుతూ భోజనం సరిగా లేదని అందోళన చేసిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు నిస్తుందని తెలిపారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులతో అడిగి తెలుసుకోవడంతో పాటు వండిన ఆహారం, కూరగాయలు, వంటగదిని పరిశీలించారు. అనంతరం అక్కడి వర్కర్లతో మాట్లాడారు. మెను ప్రకారం భోజనం పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారనీ, నాసిరకం కూరగాయలతో వండడంతో కూరలు రుచిగా ఉండడం లేదన్నారు. కరోనా సమయంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో అనారోగ్య సమస్య లకు గురై.. బాగా చదవలేకపోతున్నారని తెలిపారు. పెంచిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచాలనీ, హస్టల్‌పై ప్రిన్సిపాల్ పర్యవేక్షణ ఉండాలన్నా రు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని జావిద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రిమన్, శేఖర్ పాల్గొన్నారు.