Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) నాయ కులు డిమాండ్ చేశారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల పోరాటాలు, కార్మిక సంఘాలు, వామ పక్ష పార్టీల అండతో 1996లో నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం, 1979 వలస కార్మికుల చట్టా లను సాధించుకున్నామన్నారు. వీటిని కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే కుట్రలు చేస్తోం దన్నారు. 1996 కేంద్ర చట్టం పటిష్టంగా అమ లు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మె లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట బీసీడబ్ల్యూ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీడబ్ల్యూ గ్రేటర్ హైదరా బాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.రాజు, పి.పుల్లారావు అధ్యక్షత వహించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఏవోకు ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సంద ర్భంగా హైదరాబాద్ శ్రామిక మహిళా కన్వీనర్ ఆర్.వాణి, సీఐటీయూ సిటీ ఉపాధ్యక్షులు జె.కుమార్ స్వామి, బీసీడబ్ల్యూ వర్కింగ్ ప్రెసి డెంట్ డి.ఎల్ మోహన్ మాట్లాడారు. 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టం, 1998 సెస్సు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దారిమళ్లించిన రూ.1,005 కోట్ల నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో భవన నిర్మాణ కార్మి కులకు 20శాతం కేటాయించాలనీ, 55 ఏండ్లు పైబడిన భవన కార్మికులకు నెలకు రూ.6 వేల పింఛన్తో పాటు వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. నగరంలోని లేబర్ అడ్డాలలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ముఖ్యంగా వారు గైనిక్ సమస్యలతో బాధపడు తున్నారన్నారు. తక్షణమే అడ్డాలలో షెడ్లు నిర్మించి తాగునీరు, మరుగుదోడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకుల ధరలు తగ్గించాలనీ, వాటిపై వేస్తున్న జీఎస్టీ తగ్గించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల పేరు నమోదుకు రేషన్ కార్డు తప్ప కుండా ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలనీ, కరోనా లాక్డౌన్ సమయంలో గడువు ముగిసిన కార్డులను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 36 వేల క్లైమ్స్కు నిధులు విడుదల చేసి నిర్ణీత కాలంలో పరిష్కరించాలనీ, కార్మిక సంఘాల భాగస్వా మ్యంతో సంక్షేమ బోర్డు సలహా మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-శ్రమ్ పోర్టల్లో భవన నిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసి కార్డులు జారీ చేయాలనీ, ప్రమాద మరణానికి రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు, ప్రసూతి సహాయం రూ.ఒక్క లక్షకు పెంచాలని కోరారు. కార్మికశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనీ, కేంద్ర చట్టం లోని అన్ని స్కీమ్లను రాష్ట్రంలో అమలు చేయా లని డిమాండ్ చేశారు. కార్మికులు సమస్యల పట్ల లేబర్ ఆఫీస్ అధికారులు, కమిషనర్, సంబం ధిత మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, ఇకనైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమ స్యల పరిష్కారానికి కృషి చేయాలని.. లేని పక్షంలో నగరంలో ఉన్న లక్షల మంది భవన, నిర్మాణ కార్మికులను సమీకరించి ప్రగతి భవన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.