Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
డ్రైవర్లందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేసే దిశగా ప్రయత్నిస్తానని తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ప్రచార ప్రెసిడెంట్ పొడుగు శ్రీకాంత్ తెలిపారు. తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ నూతనంగా ప్రచార కమిటీ ప్రెసిడెంట్‌గా పొడుగు శ్రీకాంత్‌ను కమిటీ నియమించింది. తనపై నమ్మకంతో నూతన బాధ్యతలు అప్పగించిన డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బైరగోని రాజుగాడుకు సభ్యులకు కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్లప్పుడు డ్రైవర్ల సేవకు నిరంతరం కష్టపడతానని, ప్రతి డ్రైవర్‌కి న్యాయం చేకూరుస్తానని తెలిపారు.