Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
మానసిక వికలాంగులకు చేయూతనిద్దాం అని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ అన్నారు. శుక్రవారం పద్మారావు నగర్లోని ప్రభుత్వ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మానసిక వికలాంగులను పెంచడం, పెద్ద చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అని అన్నారు. అనంతరం చిన్నారులకు, తలిదండ్రులకు ఆహారం, ఇతర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కె. హేమలత, డిప్యూటీ ఐఓఎస్ శ్రీనివాస్ రాజు, టీచర్లు సుధామాధవి, ప్రవీణ్ కుమార్, స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, భారత్ గ్యాస్ డీలర్ అశోక్ కుమార్, సైకాలజిస్ట్ రాంచందర్, క్లినికల్ సైకాలజిస్ట్ అంజాన్ కుమార్ పాల్గొన్నారు.