Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
నేటి తరం యువతకు దేశభక్తిని, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలిగించాలని, అప్పుడే మాతృదేశ గొప్పతనం తెలిసివస్తుందని అరోరా కళాశాల ఇన్చార్జ్ డైరెక్టర్ ఎంసీ అజరు కుమార్ అన్నారు.
శుక్రవారం పర్వతాపూర్లోని అరోరా టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్రం రంగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో దేశభక్తి, దేశ నిర్మాణం అను అంశంపౖౖె వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎంసీ అజరు కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేణుగోపాల్ రెడ్డి, నేచర్ క్లబ్ కోఆర్డినేటర్ గీత, నెహ్రూ యువ కేంద్రం మధు కల్యాణ్ విద్యార్థులు పాల్గొన్నారు.