Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ ఈ-వేలం ద్వారా తిరుమలగిరి ఆర్టీఏకు కాసుల వర్షం కురిసింది. కేవలం ఒక్కరోజులోనే కార్యాలయ ఖజానాకు లక్షల్లో ఆదాయం వచ్చి చేరింది. శుక్రవారం నార్త్‌జోన్‌లోని సికిద్రాబాద్-తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ ఈ-వేలంలో వినియోగదారులు పోటీపడ్డారు. ఇందులో ఓ కారు యజమాని నర్సింగ్ రావు పాకాల తన విలువైన కారు కోసం రూ.6,09,999లక్షలు వెచ్చించి టీఎస్10 ఎఫ్ఏ 9999 నంబర్‌ను దక్కించుకున్నారు. అలాగే హరిష్ కుమార్ దండమూడి తన విలువైన కారు కోసం రూ.2.45,500 లక్షలు చెల్లించి టీఎస్10 ఎఫ్బి 0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. మరో యాజమాని దినేష్ కుమార్ హిమ్మత్త్మల్ తన విలువైన కారు కోసం రూ.46,117 వెచ్చించి టీఎస్10 ఎఫ్బీ 0005 నంబర్‌ను దక్కించుకున్నారు. ఈ వేలం పాట ద్వారా తిరుమలగిరి ఆర్టీఏకు రూ.11,15,822 ఆదాయం సమకూరినట్టు ఆర్టీవో వి.శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.