Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేద ప్రజల మేలు కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఖార్డ్, ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థల సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో 200 మందికి 17 రకాలతో కూడిన నిత్యావసర వస్తువులు, 14 మందికి కుట్టు మిషన్లు, 10 మందికి తోపుడు బండ్లు, 5 మందికి ఐకన్ బాక్స్‌లు, 5 మంది వికలాంగులకు, పెద్దలకు వీల్ చైర్లను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్‌తో కలిసి పంపిణీ చేశారు. సేవా దృక్పథంతో ఇంతటి మంచి కార్యక్రమానికి ముందుకు రావడం స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను అభినందించారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశం దక్కుతుందన్నారు. వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించి మహిళా భవనం ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఖార్డ్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాది సుమన్, డైరెక్టర్ మల్లాది మంజులత, ఆశ్రయ ఆకృతి వ్యవస్థాపక అధ్యక్షులు డీపీకే బాబు, నాయకులు వేణుయాదవ్, మారయ్య, హజ్రత్‌అలీ, సంతోష్‌కుమార్, నవీన్, ప్రభాకర్, శ్రీనివాస్, రంజాన్, పరశురాములు, కుమార్, సంగప్ప, రామ్మోహన్‌గౌడ్, విఠల్, సయ్యద్ సాజిత్, సరస్వతి, రజీయా, అశ్విని, మాధవి పాల్గొన్నారు.