Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మానవ మనుగడ ముందుకుసాగుతుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు వద్ద పికాక్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి కాలినడకన వచ్చే వారికి ఇతరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్భంగా శోభ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో పర్యావరణ స్పృహ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. ఈఏడాది జంతుగణనలో ఐదు వందలకు పైగా నెమళ్లు కేబీఆర్ పార్కులో ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. స్కూలు పిల్లలు పర్యావరణ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం అడవులు, జంతువులకు సంబంధించిన డ్రాయింగ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.