Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బస్తీ దవాఖాన ప్రారంభోత్సంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ మహాభారతనగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానంనాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలతో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... సిటీలోని ఆయా స్లమ్ ఏరియాలలో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు బస్తీ దవాఖానలను ప్రారంభించామన్నారు. గ్రేటర్ పరిధిలో 226 బస్తీ దవాఖానలు ఉండగా శుక్రవారం నగర వ్యాప్తంగా మరో 32 బస్తీ దవాఖానలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారన్నారు. బల్దియా పరిధిలో మొత్తం 350 బస్తీ దవాఖానల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించిందని, అందులో ముందుగా 220 దవాఖానలు అందుబాటులో ఉండగా మరో 32 దవాఖానలను శుక్రవారం అందుబాటులోకి వచ్చాయని, మిగతా 7 బస్తీ దవాఖానలు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అందుకోసం 35 కమ్యూనిటీ హాళ్లను గుర్తించామన్నారు. ఎమ్మెల్యే దానంనాగేందర్ మాట్లాడుతూ.. 52 పడకల ఆస్పత్రిని త్వరలో ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును తాను, మేయర్ కలిసి మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాభారతనగర్లో నూతన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానంనాగేందర్‌తో ప్రారంభించారు.