Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికులకు చట్టాలు ఎల్లవేళలా తోడుంటాయని జగద్గిరిగుట్ట సీఐ పి.సైదులు అన్నారు. నూతనంగా ఎన్నికైన జగద్గిరిగుట్ట భవన నిర్మాణ కార్మికుల సంఘం (ఏఐటీయూసీ) సభ్యులు ఆదివారం సీపీఐ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు హరినాథ్రావుల సంయుక్త ఆధ్వర్యంలో సీఐ సైదులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను, కార్మికులకు ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా ఇప్పించడానికి కృషి చేశామని సీఐ దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం సీఐ సైదులు మాట్లాడుతూ కార్మికులు చట్టాలను గౌరవిస్తూ పని చేయాలన్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులకు సమాచారం అందిస్తే అండగా ఉంటామన్నారు.సీపీఐ నాయకులు రాములు, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు సామెల్, ఉపాధ్యక్షులు యాదయ్య, కార్యదర్శి ఓ.రాములు, కోశాధికారి రవి, బాబు, బాలరాజు, ఈశ్వర్ పాల్గొన్నారు.