Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భగత్‌సింగ్‌నగర్‌లో ప్రజలకు కేటాయించిన భూమిని వారికి ఇచ్చి కబ్జా అవుతున్న భూములను కాపాడాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.యేసురత్నం, కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు. ఆదివారం చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో సీపీఐ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్‌సింగ్‌నగర్‌లో 1985లో రజకులకు మూడెకరాల స్థలం ప్రభుత్వం నాడు కేటాయించి ప్రజలకు పంచి ఇస్తే నేడు అధికారులు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. అప్పటి ప్రభుత్వం రజకుల కోసం ధోబిఘాట్ను, నివాసాలకు భగత్‌సింగ్‌నగర్‌లో స్థలం కేటాయించిందన్నారు. కొంత మందికి ఇండ్లు నిర్మించుకునే స్తోమత లేక పునాది నిర్మించుకుని వదిలేస్తే ప్రభుత్వ పెట్టిన సరిహద్దు లోపల పునాదులు ఉన్నప్పటికీ వాటిని కూల్చివేయడం పేద ప్రజలపై అధికారులకు కోపమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందిరచి జరిగిన తప్పును పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రాజకీయ పార్టీలను కలుపుకోని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సయ్య, సీపీఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్, రాములు, సీపీఐ నాయకులు యాకయ్య, చంద్రయ్య, యద్దన్న, అండాలు, లక్ష్మమ్మ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.